ఫోనెత్తకుంటే యాక్షన్‌‌‌‌‌‌‌‌: సెక్రటరీలకు వీడియో కాల్స్

ఫోనెత్తకుంటే యాక్షన్‌‌‌‌‌‌‌‌: సెక్రటరీలకు వీడియో కాల్స్

పనులను వీడియో రికార్డు చేస్తున్న అధికారులు
రోజు పై ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌కు చేరుతున్న ‘క్లిప్పింగ్స్‌‌‌‌‌‌‌‌’.. ఫోన్‌‌‌‌ ఎత్తకుంటే రిమార్క్స్‌‌‌‌గా నమోదు

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల యాక్షన్ ప్లాన్ పై అధికారులు నిఘా పెట్టారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు.. పంచాయతీ కార్యదర్శులకు వీడియో కాల్ చేస్తున్నారు. గ్రామాల్లో చేపడుతున్న పనులను రికార్డు చేసి, వీడియోలు, నివేదికలను పై ఆఫీసర్లకు అందజేస్తున్నారు.

‘యాక్షన్’ తర్వాత తనిఖీలు

గత నెల 6న ప్రారంభమైన యాక్షన్ ప్లాన్ ఈ నెల 6 వరకు కొనసాగనుంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటం, పిచ్చి చెట్ల తొలగింపు, శిథిలావస్థకు చేరిన ఇళ్లను కూల్చడం, గ్రామాభివృద్ధికి ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించటం, గ్రామ సభల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో యాక్షన్ ప్లాన్ ముగియగానే స్క్వాడ్ ల ద్వారా పంచాయతీల్లో తనిఖీలు చేయిస్తామని, యాక్షన్ ప్లాన్ అమలు కాని గ్రామాల్లో కార్యదర్శులు, సర్పంచ్ ల మీద చర్యలు తీసుకుంటామని ఈ మధ్యే సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాక్షన్ ప్లాన్ ముగిసేందుకు మరో  నాలుగు రోజులే ఉంది. దీంతో గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి.

చర్యలు తీసుకుంటారేమోనని ఆందోళన

హరితహారంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ చాలా జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టర్లు సస్పెండ్ చేశారు. ఇపుడు యాక్షన్ ప్లాన్ పేరుతో చర్యలు తీసుకుంటారేమోనని కార్యదర్శులు, సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు  ఆందోళన చెందుతున్నారు. జాయింట్ చెక్ పవర్ తొలగించాలని, నిధులు ఇవ్వలేదని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న సర్పంచ్ లు కూడా చర్యలకు భయపడి యాక్షన్ ప్లాన్ లో పాల్గొంటున్నారు.

నిధులు సాల్తలేవ్‌‌‌‌‌‌‌‌

యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం మొదట్లో రూ.339 కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. వీటిలో రూ.203 కోట్లు14వ ఆర్థిక సంఘం నిధులుకాగా, రూ.136 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చింది. మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త జిల్లాలను యూనిట్‌‌‌‌‌‌‌‌గా తీసుకుని నిధులిచ్చారు. అయితే ఈ డబ్బులు ఈ మాత్రం సరిపోవడం లేదని సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నారు. 30 రోజులపాటు గ్రామాల్లో పనులకు ఈ నిధులు ఎలా సరిపోతాయని, సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామంటూ వాపోతున్నారు.

రోజూ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ పంపుతున్నం 

రోజూ 8 నుంచి 10 మంది పంచాయతీ కార్యదర్శులకు వీడియో కాల్ చేసి పనులను రికార్డు చేస్తున్నం. ఆ వీడియో క్లిప్ లను, మేం చేసిన వీడియో కాల్ వివరాలను పై ఆఫీసర్లకు పంపుతున్నం. సెక్రటరీలు ఫోన్ లిఫ్ట్ చేయకుంటే రిపోర్టులో రిమార్క్స్ లో రాస్తున్నం.

– పంచాయతీ రాజ్ శాఖకు

చెందిన ఓ అధికారి

ఎవరు చేస్తున్నరో అర్థమైతలేదు

యాక్షన్ ప్లాన్ లో తీరిక లేకుండా ఉన్నం. వారం క్రితం పీఆర్ కమిషనరేట్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు  రిపోర్టు ఇవ్వటానికి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లిన. యాక్షన్ ప్లాన్ పనుల గురించి అడిగారు. ఒక వేళ ఫోన్ ఎత్తకుంటే రిమార్క్స్‌‌‌‌‌‌‌‌  రాయడం సరికాదు.

– సిరిసిల్ల జిల్లాకు చెందిన

ఓ పంచాయతీ కార్యదర్శి