ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు .. ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ..  ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించించింది. అంతకుముందు ఇవాళ ఉదయమే వారిద్దరికి గాంధీ హాస్పిటల్​లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. 

ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల  రిమాండ్‌ విధించింది.  దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్‌గూడా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా అధినేత పాత్ర ఉన్నట్లు గుర్తించారు. 

ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు సిట్‌ బృందం భావిస్తోంది.