లాటరీ డబ్బు కోసం 70 లక్షలు కట్టి మోస పోయిండు

లాటరీ డబ్బు కోసం 70 లక్షలు కట్టి మోస పోయిండు

వైజాగ్ : సైబర్ మోసాలకు ఓ వ్యక్తి భారీ అమౌంట్ ను కోల్పోయాడు. మీరు రూ.2 వేల500 కోట్లు లాటరీ గెలుచుకున్నారని.. ముందుగా రూ.34 వేల 500 డిపాజిట్ చెయ్యాలంటూ మెయిల్ చేశారు. ఆ తర్వాత మరింత కట్టాలంటూ ఫోన్ చేశారు. ఇలా రూ.70 లక్షలు కోల్పోయాక తాను మోసపోయానని తెలుసుకున్నాడు. ఈ సంఘటన వైజాగ్ లో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. వైజాగ్ కు చెందిన బి.రామృష్ణకి వరల్డ్ లాటరీ ఆర్గనైజేషన్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. అందులో 250,000,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు (2500 కోట్లు) గెలుచుకున్నట్లు ఉంది. ఆ తర్వాత HSBC బ్యాంకు అధికారనని… యూకే నుంచి మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి రామకృష్ణకి ఫోన్ చేశాడు. ప్రైజ్ మనీ పొందాలంటే యూకేలోని తమ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలని.. దానికి కొంత సొమ్ము కట్టాలని కండిషన్ పెట్టాడు.

ఓ ఫేక్ అకౌంట్ నంబర్ ఇచ్చి, ఇది నీ(రామకృష్ణ) బ్యాంక్ నంబరేనని నమ్మించాడు. అందులో అమౌంట్ ను డిపాజిట్ చేయాలని తెలిపాడు. రూ.34,500 నగదును ఫస్ట్ డిపాజిట్ చేసిన రామకృష్ణ … దఫదఫాలుగా వారికి రూ. 70 లక్షలు డిపాజిట్ చేశాడు. తర్వాత అకౌంట్ బ్లాక్ కావడంతో.. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వైజాగ్ సైబర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.