సింహం కూనతో ఫొటోలు.. వైరల్​ అవుతున్న వీడియో

సింహం కూనతో ఫొటోలు.. వైరల్​ అవుతున్న వీడియో

సాధారణంగా సింహాన్ని చూస్తే హడలిపోతాం. వాటి పిల్లల్ని చూసినా కొంచెం అటు ఇటుగా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ పిల్లల అందమైన పాదాలు,ఉల్లాసభరితమైన ప్రవర్తన చూసి ఒక్క సారైనా దానిని ముట్టుకోవాలని అనిపిస్తుంటుంది. నిజంగా అలాంటి అవకాశమే వస్తే.. ఇంకేముంది దానితో ఫొటోలు,సెల్ఫీలు అబ్బో.. అలాంటిది ఓ వన్యప్రాణి ఫొటో గ్రాఫర్ ఏకంగా సింహం కూనను పెంచుకుంటున్నాడు.

కూనను మచ్చిక చేసుకుని.. 

అల్జీరియాకు చెందిన ఫొటోగ్రాఫర్ డ్జామెల్ హాడ్జ్ ఐస్సా, ఓ సింహం కూనను పెంచుకుంటున్నాడు. అతను ఎడారిలోకి వెళ్లి ఫొటోలు తీద్దామనుకున్నాడు. వెంట కూనను కూడా తీసుకెళ్లారు. చిన్న కుర్చీ వేసి ఫొటో షూట్ చేయడం ప్రారంభించాడు. ఇసుకపై పడుకుని వేర్వేరు జంతువులు, వస్తువులను ఫొటోలు తీస్తున్న క్రమంలో సింహం కూన చిన్న కుర్చీలో దర్జాగా కూర్చొని ఫొటోలకు స్టిల్ ఇచ్చింది.  ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్​నెట్​లో వైరల్​గా మారింది. దీనిని 6.4 మిలియన్లకు పైగా వీక్షించారు. 2 లక్షలకు పైగా నెటిజన్లు లైక్​ కొట్టారు. ఈ ఫొటో సింహం పిల్ల మనిషికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.