నోట్స్ ఇస్తామని ఇంటికి పిలిచి.. స్టూడెంట్పై ఫిజిక్స్, బయాలజీ లెక్చరర్ల అఘాయిత్యం.. వాళ్ల ఫ్రెండ్ కూడా..

నోట్స్ ఇస్తామని ఇంటికి పిలిచి.. స్టూడెంట్పై ఫిజిక్స్, బయాలజీ లెక్చరర్ల అఘాయిత్యం.. వాళ్ల ఫ్రెండ్ కూడా..

గురువు అంటే విద్యాబుద్ధులు చెప్పి.. విద్యార్థిని సక్రమ మార్గంలో నడిపించేవాడు. తల్లిదండ్రుల తర్వాత  అంతకు మించిన బాధ్యతతో స్టూడెంట్ ను విజయపథాలవైపు నడపాల్సిన వాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే గురువులు.. ఆ పదానికి ఉన్న అర్థానికే మకిలి అంటించేలా ప్రవర్తించారు. తండ్రి సమానులుగా భావించి నోట్స్ ఇస్తామంటే నమ్మి వెళ్లిన స్టూడెంట్ పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వాళ్ల ఫ్రెండ్ తో కూడా దారుణం చేయించేలా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

బెంగళూరులో జరిగింది ఈ అమానవీయ ఘటన.  స్టూడెంట్ ను రేప్ చేసిన ఇద్దరు లెక్చరర్లతో పాటు మరో వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు పోలీసులు. బాధితురాలు కర్ణాటక మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫిజిక్స్ లెక్చరర్ అయిన నరేంద్ర, బయాలజీ లెక్చరర్ అయిన సందీప్ తో పాటు వాళ్ల ఫ్రెండ్ ను కూడా అరెస్టు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఫజిక్స్ లెక్చరర్ అయిన నరేంద్ర.. నోట్స్ ఇస్తానని తన స్టూడెంట్ ను ఫ్రెండ్ ఇంటికి రావాల్సిందిగా పిలిచాడు. ఆ తర్వాత స్టూడెంట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బయాలజీ లెక్చరర్.. కూడా స్టూడెంట్ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫిజిక్స్ లెక్చరర్ రేప్ చేస్తున్న వీడియో తన  వద్ద ఉందని.. తనకు సహకరించకపోతే బయటపెడతానని బెదిరించి అత్యాచారానికి దిగాడు. ఈ లెక్చరర్లకు స్నేహితుడైన అనూప్ అనే వ్యక్తి.. సీసీటీవీ ఫూటేజ్ బయటపెడతానని బెదిరించి.. వీడు కూడా అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

ఈ దారుణ ఘటన నెల రోజుల క్రితం జరిగింది. అయితే దుర్మార్గుల చేతిలో నలిగిపోయిన స్టూడెంట్ తన తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పడంతో ఈ దారుణం బయటపడింది. లెక్చరర్ల రూపంలో ఉన్న కామ పిశాచులకు తగిన శిక్ష పడాలని.. లేదంటే మరెందరి జీవితాలు నాశనం చేస్తారోనని.. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు మరఠహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేసు జులై 5న రిజిస్టర్ అయ్యిందని జాయింట్ కమిషనర్ రమేశ్ బానోత్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఆదేశాల ప్రకారం.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.