ప్లీజ్… విజయ్ శంకర్‌ను తీసేయొద్దు : పీటర్సన్ వెటకారం

ప్లీజ్… విజయ్ శంకర్‌ను తీసేయొద్దు : పీటర్సన్ వెటకారం

టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ .. జనరల్ మీడియా, సోషల్ మీడియాలోనే కాదు.. పబ్లిక్ లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ పక్కకు తప్పుకోవడంతో.. జట్టులోకి వచ్చాడు తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్. ఆడిన 3 మ్యాచ్ లలో చెప్పుకోతగ్గ ప్రదర్శన చేయకున్నా.. అతడి స్థానంలో మార్పు లేదు. విజయ్ శంకర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి.. ఆప్ఘనిస్థాన్ పై 29, వెస్టిండీస్ పై 14 పరుగులు చేశాడు. పాకిస్థాన్ పై ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 15 నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో 2 వికెట్లు పడగొట్టాడు. ఐతే.. అతడిని కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.

తాజాగా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “డియర్ విరాట్ , రవి.. విజయ్ శంకర్ ను టీమ్ నుంచి పక్కన పెట్టకండి. రేపు ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో సత్తా చూపిస్తాడు. రిషభ్ పంత్ గురించి ఆలోచించకండి. మీ వరల్డ్ కప్ టీమ్ లోకి రావడానికి అతడికి మరో 3 నెలల టైమ్ పట్టొచ్చు” అని వెటకారపు ట్వీట్ చేశాడు.

దీనిపై నెట్ యూజర్స్ సీరియస్ అవుతున్నారు. పీటర్సన్ ట్వీట్ … విజయ్ శంకర్ ను మానసికంగా కుంగదీసేలా ఉందన్నారు. ఇండియాకు పీటర్సన్ సలహాలు అవసరం లేదన్నారు.  వెళ్లి ఇంగ్లండ్ కు సలహాలిచ్చుకో అని కొందరన్నారు.