ఓఆర్‌‌ఆర్‌‌ టెండర్‌‌పై పిల్‌‌

ఓఆర్‌‌ఆర్‌‌ టెండర్‌‌పై పిల్‌‌

హైదరాబాద్, వెలుగు : ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డు నిర్వహణ, టోల్‌‌ వసూళ్ల టెండర్‌‌ను సవాల్‌‌ చేస్తూ హైకోర్టులో పిల్‌‌ దాఖలైంది. 30 ఏండ్ల పబ్లిక్‌‌ ప్రైవేట్‌‌ భాగస్వామ్య రాయితీ ఒప్పందంపై హెచ్‌‌ఎండీఏ కమిషనర్‌‌ సంతకాలు చేయడాన్ని సిద్దిపేటకు చెందిన జి రఘువీర్‌‌ రెడ్డి సవాల్‌‌ చేశారు. ‘ఓఆర్‌‌ఆర్‌‌ నిర్వహణ, టోల్‌‌ వసూళ్లకు సంబంధించి ఐఆర్‌‌బీ గోల్కొండ ఎక్స్‌‌ప్రెస్‌‌తో ప్రాథమిక అంచనా వేయించకుండానే రాయితీ అగ్రిమెంట్‌‌పై హెచ్‌‌ఎండీఏ మే 28న సంతకాలు చేసింది. 

ఇది ఏకపక్షం. ఒక ప్రైవేట్‌‌ కంపెనీకి మేలు జరిగేలా ఒప్పందం కుదుర్చుకుంది. పారదర్శకంగా చేయలేదు. 2022–23లో రూ.542 కోట్లు, 2024–25లో రూ. 689 కోట్లు టోల్​ ద్వారా వసూలైంది. సగటున రోజుకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.4 కోట్లు వసూలైతే గోల్కొండ్‌‌ ఎక్స్‌‌ ప్రెస్‌‌కు రూ.65 లక్షలకే అప్పగించింది’ అని పిల్​ దాఖలు చేశారు. ఈ పిల్‌‌లో మున్సిపల్‌‌ శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌‌ఎండీఏ కమిషనర్, హైదరాబాద్‌‌ గ్రోత్‌‌ కారిడార్‌‌ లిమిటెడ్, ఐఆర్‌‌బీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ లిమిటెడ్, ఐఆర్‌‌బీ గోల్కొండ ఎక్స్‌‌ ప్రెస్‌‌ లిమిటెడ్‌‌లను ప్రతివాదులుగా చేర్చారు.