సమాచార హక్కుచట్టంను నిర్వీర్యం చేస్తున్న సర్కార్

V6 Velugu Posted on Oct 25, 2021

సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని  పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది రాపోలు భాస్కర్. సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెలుసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని పిల్ లో పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ హెడ్ ల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు పిటిషనర్.

సమాచార హక్కు చట్టం కింద ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా డిపార్ట్మెంట్ హెడ్ ల అనుమతి తీసుకోవాలని ఈ నెల 13న సీఎస్ జీవో జారీ చేశారు. కొందరు ఫైల్లు సరిగా పరిశీలించకుండానే వివరాలు ఇస్తున్నారని..అందుకే ఆదేశాలిచ్చామన్నారు సీఎస్.

Tagged Right to information Act, Pill file, High Cour, CS GO

Latest Videos

Subscribe Now

More News