డబుల్’ ఇండ్లకు వెళ్లాలంటే..  కాలినడకా కష్టమే

డబుల్’ ఇండ్లకు వెళ్లాలంటే..  కాలినడకా కష్టమే

జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లి కొటాల్​ డబుల్ బెడ్ రూమ్ కాలనీ రోడ్లు కాలినడకకు సైతం వీలు లేకుండా తయారయ్యాయి. ఇక్కడ మొత్తం 1000 ఇండ్ల నిర్మాణం చేపట్టగా 300 ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రెండో విడతలో మరో 300 ఇండ్ల వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేసిన ఇండ్లలో 250కిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. స్థానికులు మట్టి రోడ్లతో ముప్పు తిప్పలు పడుతున్నారు.

చిన్న వానకే ఆ రోడ్లు  చిత్తడవుతున్నాయి. ఆ రోడ్లలో ఆటోలు, బైక్​లు కాదు.. కనీసం నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఒక గల్లీలో పెద్ద మొత్తంలో నీరు నిలిచి అది బయటకు వెళ్లే మార్గం లేక కుంటలా మారింది. రెండో విడత పంపిణీ చేయనున్న ఇండ్లకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పనులు కంప్లీట్​ చేసి సౌలత్​లు సరిగా ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -  మెదక్, వెలుగు