ధర్మశాల: తేజస్పైలట్, వింగ్కమాండర్నమాన్ష్శ్యాల్అంత్యక్రియలు ఆదివారం తన స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా పతియాల్కర్లో అశ్రునయనాల నడుమ ముగిశాయి. జనం పెద్ద సంఖ్యలో ఆయనకు నివాళులర్పించారు. నమాన్ష్ భౌతికకాయం ముందు ఆయన భార్య అఫ్షాన్సెల్యూట్చేస్తూ.. తుది వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ఆమె కన్నీళ్లను దిగమింగుకుంటూ కనిపించారు. అఫ్షాన్కూడా ఇండియన్ఎయిర్ఫోర్స్లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్నారు.
యూనిఫామ్‌లోనే ఆమె తన భర్త భౌతికకాయం వద్దకు వచ్చి.. సెల్యూట్చేశారు. ఈ నెల 21న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ జెట్కూలిపోవడంతో అందులోని పైలెట్, వింగ్ కమాండర్నమాన్ష్ ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో భాగంగా భార్య అఫ్షాన్, ఏడేండ్ల కూతురు ఆర్యతో కలిసి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఆయన ఉండేవారు. తన భర్తకు ప్రమాదం జరిగిన టైమ్‌లో అఫ్షాన్ కోల్‌కతాలో ట్రైనింగ్‌లో ఉన్నారు. నమాన్ష్ తండ్రి జగన్నాథ్ కూడా ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు.
