
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10.30కు విచారణకు రావాల్సి ఉండగా.. అయ్యప్ప దీక్షలో ఉండటం వల్ల భిక్ష చేసుకుని ఇప్పుడు వచ్చానని రోహిత్ రెడ్డి తెలిపారు. అయితే దీక్షలో ఉన్న కారణంగా విచారణకు ఉదయం రాలేనని.. మధ్యాహ్నమే వస్తానని నిన్ననే ఈడీ అధికారులకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఏ కేసులో తనను విచారిస్తున్నారో తెలియడం లేదని రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రోహిత్ రెడ్డి తీసుకువచ్చిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా పైలట్‌ను ప్రశ్నించనున్నారు. అలాగే.. బ్యాంక్ అకౌంట్లు, ఆర్థిక లావాదేవీలపై రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది.