గగనతలంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

గగనతలంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

కొలంబియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఢీకొని మంటలు చెలరేగడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. జూలై 1న జరిగిన ఈ ఘటన అపియాయ్ ఎయిర్ బేస్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.

సెంట్రల్ కొలంబియాలోని మెటాలోని అపియాయ్ ఎయిర్ బేస్‌లో రెండు విమానాలు శిక్షణా వ్యాయామంలో పాల్గొంటున్నప్పుడు ఈ విషాద ప్రమాదం జరిగిందని స్థానిక రేడియో నెట్‌వర్క్ డబ్ల్యు రేడియో కొలంబియా నివేదించింది. దేశ వైమానిక దళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారు. శిక్షణా మిషన్‌లో ఉన్న రెండు T-27 టుకానో విమానాలు 2వ ఎయిర్ కంబాట్ కమాండ్ వద్ద కూలిపోయాయని తెలియజేయడానికి చింతిస్తున్నామని కొలంబియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

రెండు T-27 టుకానో విమానాలు ఢీకొని, మంటలు చెలరేగినప్పుడు శిక్షణా వ్యాయామం సమయంలో యుద్ధ విమానాలు సర్కిల్‌లో వెళుతున్నట్లు ఘోరమైన క్రాష్ వీడియో చూపిస్తుంది. ఇద్దరు పైలట్‌ల మృతికి సంతాపం తెలుపుతూ వైమానిక దళం.. “మరణించిన పైలట్, లెఫ్టినెంట్ కల్నల్ మారియో ఆండ్రెస్ ఎస్పినోసా గొంజాలెజ్ (RIP) కుటుంబానికి  సంతాపాన్ని, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

https://twitter.com/WRadioColombia/status/1675285365865828352