ఏఐఎఫ్టీఓ వర్కింగ్ ప్రెసిడెంట్​గా శ్రీపాల్ రెడ్డి

ఏఐఎఫ్టీఓ వర్కింగ్ ప్రెసిడెంట్​గా శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఫెడరేషన్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్టీఓ) జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఏఐఎఫ్టీఓ జాతీయ స్థాయి కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పింగిలి శ్రీపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

గతంలో శ్రీపాల్ రెడ్డి పీర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2021–24 వరకు ఏఐఎఫ్టీఓ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన యూపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసే దాకా దేశంలోని అన్ని సంఘాలను ఏకం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

పీఆర్టీయూ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు గీత, సలహాదారుగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ఎంపికయ్యారు. కాగా, పీఆర్టీయూటీ కమిటీ నుంచి ఏఐఎఫ్టీఓ వైస్ ప్రెసిడెంట్ గా ముదిరేసి చెన్నయ్య, సెక్రటరీ జనరల్​గా గోలి పద్మ, సెక్రటరీగా ఎండీ అబ్దుల్లా ఎన్నికైనట్టు నేతలు తెలిపారు.