
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ 2025 లో నిలకడకు మారు పేరుగా దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో తనదైన మార్కుతో చెలరేగాడు. ఈ మెగా టోర్నీలో ఎవరూ చూపించని నిలకడ చూపిస్తూ ఏకంగా ప్రపంచ రికార్డ్ ను సమం చేశాడు. బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లోనే 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేస్ లో నేను ఉన్నానని దూసుకొచ్చాడు.
ALSO READ | MI vs DC: ఒంటరి పోరాటంతో ముంబైని నిలబెట్టిన సూర్య.. ఢిల్లీ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
ఇదంతా పక్కనపెడితే ఈ టోర్నీలో ఈ ముంబై బ్యాటర్ ఎవరూ సాధించలేని రికార్డ్ సాధించడం విశేషం. అదేంటో కాదు ఆడిన 13 మ్యాచ్ ల్లో 25కి పైగా స్కోర్లు చేశాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా 29, 48, 27*, 67, 28, 40, 26, 68*, 40*, 54, 48,35,73 పరుగులు చేసి తన నిలకడను చూపించాడు. దీంతో వరుసగా 13 మ్యాచ్ ల్లో 25 పైగా పరుగులు చేసి సౌతాఫ్రికా బ్యాటర్ టెంబా బవుమా రికార్డ్ సమం చేశాడు. బవుమా టీ20 క్రికెట్ లో వరుసగా 13 సార్లు 25 కి పైగా పరుగులు చేయడం విశేషం. వీరిద్దరి తర్వాత కైల్ మేయర్స్, క్రిస్ లిన్, కుమార్ సంగక్కర, జాక్వెస్ రుడాల్ఫ్, బ్రాడ్ హాడ్జ్ వరుసగా 11 స్కోర్లు చేసి తర్వాత స్థానాల్లో నిలిచారు.
ALSO READ | IRE vs WI: 10 వేల పరుగుల క్లబ్‌లో ఐర్లాండ్ క్రికెటర్.. తొలి ఐరీష్ ప్లేయర్‌గా చరిత్ర
ఈ సీజన్ లో చివరి మ్యాచ్ లోనూ సూర్య 25 పైగా పరుగులు కొడితే బావుమాను ధాటి ఈ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంటాడు. ముంబై తమ చివరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. మరి సూర్య ఈ వరల్డ్ రికార్డ్ అందుకుంటాడా లేదో చూడాలి. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు సూర్య 13 మ్యాచ్ ల్లో 583 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో సాయి సుదర్శన్ (617), గిల్ (601) ఉన్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్ల ధాటికి కుదేలయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ( 43 బంతుల్లో 73: 7 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు నమన్ ధీర్(8 బంతుల్లో 22: 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు.. చమీర, కుల్దీప్ , ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.
Suryakumar Yadav in IPL 2025
— All Cricket Records (@Cric_records45) May 21, 2025
29 (26)
48 (28)
27* (9)
67 (43)
28 (26)
40 (28)
26 (15)
68* (30)
40* (19)
54 (28)
48* (23)
35 (24)
73* (43), Today
13 innings, all time cross 25 runs. pic.twitter.com/ElZLA8IbYt