MI vs DC: ఒంటరి పోరాటంతో ముంబైని నిలబెట్టిన సూర్య.. ఢిల్లీ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

MI vs DC: ఒంటరి పోరాటంతో ముంబైని నిలబెట్టిన సూర్య.. ఢిల్లీ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లో మరోసారి విఫలమయ్యారు. బుధవారం (మే 21) ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఆతిధ్య జట్టుకు భారీ స్కోర్ సమర్పించుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేనకు మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్ల ధాటికి కుదేలయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ( 43 బంతుల్లో 73: 7 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు నమన్ ధీర్(8 బంతుల్లో 22: 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

ALSO READ | MI vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. అక్షర్ పటేల్ లేకుండానే మ్యాచ్

ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే ముంబైకి బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రికెల్ టన్, విల్ జాక్స్ పవర్ ప్లే లో ధాటిగా ఆడుతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంత వరకు వేగంగా ఆడిన జాక్స్ 21 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. రికెల్ టన్ మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లే ముంబై 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.

ALSO READ | IPL 2025: RCB కోసం రిస్క్ చేస్తున్న ఆసీస్ పేసర్ .. బెంగళూరు జట్టులో హాజిల్‌వుడ్ చేరేది అప్పుడే!

పవర్ ప్లే తర్వాత ముంబై స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 7 ఓవర్లో మంచి టచ్ లో కనిపించిన రికెల్ టన్ (25) ఔట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిడిల్ ఓవర్స్ లో ముంబై పరుగులు చేయడానికి తంటాలు పడింది. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ క్రీజ్ లో ఉన్నా పరుగులు వేగంగా చేయలేకపోయారు. సూర్యతో కలిసి స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. వెంటనే హార్దిక్ పాండ్య (3) ఔట్ కావడంతో ముంబై మరోసారి కష్టాల్లో పడింది.

ALSO READ | IPL 2025: సెంచరీ తర్వాత 500 కంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయి.. నాకు ఎవరూ అవసరం లేదు: సూర్యవంశీ

ఒకవైపు వికెట్లు సూర్య చివరి వరకు బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. నమన్ ధీర్ తో బౌండరీల వర్షం కురిపించడంతో ముంబై 180 పరుగుల మార్క్ చేరుకుంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు.. చమీర, కుల్దీప్ , ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు. చివరి రెండు ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం విశేషం.