MI vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. అక్షర్ పటేల్ లేకుండానే మ్యాచ్

MI vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. అక్షర్ పటేల్ లేకుండానే మ్యాచ్

ఐపీఎల్ 2025లో బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనునున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. ముఖ్యంగా ఢిల్లీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. 

ALSO READ | WTC 2025 Final: ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. సౌతాఫ్రికా కొత్త జెర్సీ ఆవిష్కరణ

మరోవైపు ముంబై ఈ మ్యాచ్ లో ఓడిపోతే చివరి లీగ్ మ్యాచ్ లో తప్పనిసరిగా విజయం సాధించడంతో పాటు ఢిల్లీ తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఓడిపోవాలి. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఈ కీలక మ్యాచ్ కు ఢిల్లీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ముంబై జట్టులోకి మిచెల్ సాంట్నర్ వచ్చాడు.  

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీరా, విప్రజ్ నిగమ్, మాధవ్ వారీ, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా