
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 మధ్య జరగనుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్ కు ఇప్పటికే ఇరు జట్లు తమ స్క్వాడ్ ప్రకటించారు. ఫైనల్ కు మరో 20 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా బుధవారం (మే 21) తమ ఫైనల్ కు ఆడబోయే తమ జెర్సీని రివీల్ చేశారు. ఈ జెర్సీలో కుడివైపు ఐసీసీ WTC ఫైనల్ 2025 అని రాసి ఉంది. ఎడమ వైపు ప్రోటీస్ లోగో ఉంది. మధ్యలో తమ దేశం పేరు సౌతాఫ్రికా అని రాయబడి ఉంది. జెర్సీ ఎడమ వైపు భుజానికి బీర్ బ్రాండ్ లోగో 'కాజిల్ లాగర్' ఉంటుంది.
ఈ మెగా ఫైనల్ కు 15 మంది ఆటగాళ్ల సౌతాఫ్రికా స్క్వాడ్ ను మంగళవారం (మే 13) ప్రకటించారు. కగిసో రబాడ, మార్కో జాన్సెన్, డేన్ పాటర్సన్, వియాన్ ముల్డర్, కార్బిన్ బాష్ వంటి పేసర్లతో ఫాస్ట్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. వీరికి తోడు లుంగీ ఎన్గిడి స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో కెప్టెన్ బావుమాతో పాటు.. ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. వికెట్ కీపర్ గా కైల్ వెర్రెయిన్ కొనసాగనున్నాడు. కేశవ్ మహారాజ్, సేనురాన్ ముత్తుస్వామి రూపంలో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.
ఆస్ట్రేలియా టెస్ట్ స్క్వాడ్ ప్రకటించిన కాసేపటికి సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించడం విశేషం. జూన్ 11 నుంచి 15 మధ్య ఫైనల్ జరగనుంది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా 2023 ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి.
జూన్ 3 న సస్సెక్స్ తో సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ప్లేయర్స్ ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్నారు. గ్రూప్ దశ ముగిసిన తర్వాత చాలా మంది సఫారీ క్రికెటర్లు ఇంగ్లాండ్‌కు వెళతారు. ఒకవేళ తమ జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తే మే 25న టోర్నమెంట్ ముగిసిన తర్వాత మిగిలిన వారు సౌతాఫ్రికా జట్టులో చేరతారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో భాగాంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్నాయి.
టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025 ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనూర్న్ రికెల్టన్
South Africa🇿🇦 Jersey for WTC Final 2025 👕🏆 pic.twitter.com/0TuSMsZj0B
— CricketGully (@thecricketgully) May 20, 2025