
కోల్‌కతా: చారిత్రక పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లలో 106 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 89.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాపై భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్సులో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌట్ అవడంతో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2-0 తేడాతో టెస్టు సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.