బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ల ఆటతీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓవర్ నైట్ స్కోర్ 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ నువ్వా నేనా అన్నట్లు అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 15 పరుగుల వద్ద వరుసగా నాలుగు వికెట్లు పడ్డాయి.
బుమ్రా (2), పుజార (0), అగర్వాల్ (9), అజింక్య రహానే (0), విరాట్ కోహ్లీ (4), విహారి (8), వృద్ధిమాన్ సాహా (4), రవిచంద్రన్ అశ్విన్ (0) వరుసగా క్యూకట్టారు. అయితే పాట్ కమ్మిన్స్ వేసిన ఒక బంతి మహ్మద్ షమి చేతికి తగిలి గాయపడటంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో టీమ్ ఇండియా 36/9 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది. బ్యాటింగ్ కు దిగిన కంగారు బ్యాట్స్ మెన్ టార్గెట్ ను ఈజీగా ఛేదించారు.
అయితే భారత్ ఆటగాళ్ల సీనియర్లతో పాటు ఇతర దేశాల క్రికేటర్లసైతం సెటైర్లు వేస్తున్నారు. ఇది ఘోరం..ఇది అత్యంత ఘోరం. నా టైమ్ లైన్ చూడాలంటే కోపం వస్తుందని భారత్ మాజీ ఆటగాడు వసీం జాఫర్ మండిపడ్డారు.
నేను నిద్రలేచి భారత్ జట్టు స్కోర్ చూసినప్పుడు 369 గా కనిపించింది. దానిని నేను నమ్మలేకపోయా. మొహం కడుక్కొని వచ్చి చూసే సరికి భారత్ జట్టు స్కోర్ 36/9 గా ఉందంటూ పాకిస్తాన్ రావల్పిండి ఎక్స్ ప్రెస్, పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తనదైన స్టైల్లో మండిపడ్డారు.

