తప్పు చేస్తే విమర్శించండి.. తప్పుడు ప్రచారం చేయొద్దు : బీఆర్ఎస్ కు బల్మూరి వెంకట్ వార్నింగ్

తప్పు చేస్తే విమర్శించండి.. తప్పుడు ప్రచారం చేయొద్దు : బీఆర్ఎస్ కు బల్మూరి వెంకట్ వార్నింగ్

తెలంగాణలో పదేండ్లు గడీల పాలన సాగిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సీఎం రేవంత్ వచ్చాకా గడీల పాలనకు స్వస్తి పలికారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన వచ్చిందన్నారు. ఏసీలకు అలవాటు పడ్డ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు మూడు లక్షలు ఇస్తున్నారని అన్నారు. 

గతంలో నే క్రిశాంక్ ఫేక్ జీవోలు తయారు చేసి జైల్లోకి పోయిండని గుర్తు చేశారు. టీఎస్ కు బదులు టీజీగా మార్చినందుకు వేలకోట్లు ఖర్చు అవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని తప్పుడు పేపర్లు జీవో కాపీలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేశామన్నారు. 

డీజీపీ వద్ద తేల్చుకుందాం రండని సవాల్ విసిరారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజా దర్బార్ ఉంది చెప్పండని సూచించారు. బాధ్యత గల జర్నలిస్టులు కొందరు తప్పుగా వ్యవహరిస్తున్నారని బల్మూరి వెంకట్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి దుమ్మెత్తి పోస్తున్నారని తప్పుడు పత్రాలు సృష్టించి బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్స్ లలో పెట్టి నిజమని నమ్మిస్తున్నారని చెప్పారు. 

ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించండి. తప్పుడు ప్రచారాలు చేయకండని సూచించారు.  గురుకుల, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన పడకండని కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి సరి చేస్తున్నామని తెలిపారు. ఒక్క ఇబ్బంది కలగకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని చెప్పారు బల్మూరి వెంకట్.