IND vs AFG: పరుగుల వరద పారాల్సిందే.. మొహాలీ పిచ్ రిపోర్ట్ ఇదే

IND vs AFG: పరుగుల వరద పారాల్సిందే.. మొహాలీ పిచ్ రిపోర్ట్ ఇదే

టీ20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా భారత్ తమ చివరి సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20 సిరీస్ లో భాగంగా నేడు(జనవరి 11) మొదటి టీ20 లో తలపడనుంది, మొహాలీ వేదికగా జరగనున్న ఈ టీ20 మ్యాచ్ లో టీమిండియా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగబోతుంది. వరల్డ్ కప్ దగ్గర పడుతుండటంతో స్టార్ ప్లేరలందరూ జట్టులో చేరిపోయారు. రోహిత్, కోహ్లీ 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్ లో కనిపించనున్నారు.

కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన తొలి టీ20 మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదని ఇప్పటికే జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో నేడు జరగబోయే టీ20లో కళ్లన్నీ కెప్టెన్ రోహిత్ శర్మ మీదే ఉన్నాయి. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో వన్డేలను టీ20 తరహాలో ఆడిన హిట్ మ్యాన్..ఈ రోజు ఎంత విధ్వంసం సృష్టిస్తాడో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 

చండీగఢ్‌లోని ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభం నుంచి బంతి బ్యాట్ పైకి వస్తుంది. ఈ వేదికపై ఇప్పటివరకు జరిగిన ఆరు టీ20ల్లో, నాలుగు సార్లు ఛేజింగ్ చేసిన జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు మాత్రమే గెలిచింది. 2023 ఐపీఎల్ సీజన్ లో ఈ వికెట్ పై బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఛేజింగ్ చేసే జట్టు విజేతగా విజయావకాశలు ఎక్కువగా ఉంటాయి. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.   

భారత జట్టు(అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.