విజయ్ దేవరకొండపై పీకే ఫ్యాన్స్ ఆగ్రహం

విజయ్ దేవరకొండపై పీకే ఫ్యాన్స్ ఆగ్రహం

పాత సినిమాల టైటిల్స్ ను వాడుకొంటుంటారు కొంతమంది దర్శకులు. కానీ.. అప్పుడప్పుడు ఈ టైటిల్స్ వివాదాస్పదమౌతుంటాయి. కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. దీంతో వివాదం కాస్త ముదురుతుంది. గతంలో పెద్ద హీరోలు నటించిన సినిమాల టైటిల్స్ ను కొంతమంది వాడుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ లీడర్, తొలిప్రేమ, గీతాంజలి, ఇలా కొన్ని సినిమాల టైటిల్స్ ను వాడుకుంటున్నారు. అయితే ఇలా పెద్ద హీరోల సినిమాలను వాడుకోవడం పట్ల వాళ్ల ఫ్యాన్స్ కుర్ర హీరోల మీద ఫైర్ అవుతుంటారు.

అప్పట్లో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ను వాడుకున్నందుకు నేచురల్ స్టార్ ‘నాని’ని సోషల్ మీడియాలో చిరంజీవి ఫ్యాన్స్ గరంగరమయ్యారు. ఇప్పుడు ‘విజయ్ దేవరకొండ’ వంతు వచ్చింది. ఆయన్ను కూడా అలాగే తిడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. యూత్ లో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. రౌడీ హీరోగా జనం మదిలో నిలిచిపోయాడు. స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ యంగ్ హీరో ‘సమంత’తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ సినిమా పేరు ‘ఖుషి’ కావడం. పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా 2001లో రిలీజ్ అయి..ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ నటించిన టైటిల్ ను విజయ్ దేవర కొండ మూవీకి వాడుకోవడంపై పీకే ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడియాలో విజయ్ ను టార్గెట్ గా చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఖుషి అనేది పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ టైటిల్, దాన్ని రౌడీ హీరో ఎలా వాడుకుంటారు ? అని ఓ రెంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘‘తొలిప్రేమ’’ టైటిల్ ను వరుణ్ తేజ్ వాడుకున్నప్పడు లేని అభ్యంతరం ఇప్పుడు విజయ్ వాడుకుంటే తప్పేంటని రౌడీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీంతో పీకే ఫ్యాన్స్ వర్సెస్ రౌడీ ఫ్యాన్స్ గా మారిపోతోంది. వీరి మధ్య వార్ తో సోషల్ మీడియా హీటెక్కింది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో వెయిట్ అండ్ సీ.

మరిన్ని వార్తల కోసం :-

అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2 ... కానీ ఓ నిబంధన.. !మహేశ్ డ్యాన్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్