అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2 ... కానీ ఓ నిబంధన.. !

అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2 ... కానీ ఓ నిబంధన.. !

బాహుబలి సినిమా తర్వాత భారతీయ సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ లో చాటి చెప్పిన మరో సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా  వచ్చిన ఈ సినిమా చాప్టర్ 1 ఎంతటి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇటీవలే చాప్టర్2 సైతం రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ మాస్, యాక్షన్, థ్రిల్లర్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం ఓ శుభవార్తను అందించింది. అమెజాన్ ప్రైమ్  వేదికగా ఓటీటీలో విడుదల ఈ మూవీని స్ట్రీమింగ్ చేశారు మూవీ నిర్వాహకులు. వావ్... అయితే వెంటనే చూసేద్దాం అంటూ ఉత్సాహపడకండి. ఈ సినిమాను వీక్షించాలంటే ఓ నిబంధన అంటూ ప్రైమ్ అందర్నీ షాక్ కు గురిచేసింది.

అదేంటంటే ఎర్లీ స్ట్రీమింగ్ పేరిట అదనంగా రూ.199 చెల్లించాకే  కేజీఎఫ్ ఛాప్టర్ 2 చూడొచ్చంటూ అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ట్విస్ట్ తో యశ్ ఫ్యాన్స్ నిరాశకు గురిచేసింది. అలా రూ.199తో ఈ మూవీని అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే సినిమా చూడడం మొదలు పెట్టిన 48 గంటల లోపే మూవీని కంప్లీట్ చేయాలనే మరో రూల్ అందర్నీ ఊసురుమనిపిస్తోంది. అంటే కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఓపెన్ చేసిన రెండు రోజుల్లోనే పూర్తిగా చూడాలన్న మాట. ఇదే తరహాలో ఆర్ ఆర్ ఆర్ సైతం మే 20న జీ 5 లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాకు గాను రూ.100 చెల్లించాలని, దీని వ్యాలిడిటీ 7 రోజులు అని అనౌన్స్ చేసింది. ఈ మూవీని 24గంటల్లో చూసేయాలంటూ ఓ ప్రకటనలో వెలువరించింది.

 

 

మరిన్ని వార్తల కోసం....

మహేశ్ డ్యాన్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్

అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2