
న్యూఢిల్లీ: ఐపీఎల్–18 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు తరలించారు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ధర్మశాల ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేశారు.
దీంతో ప్లేయర్లు అక్కడికి వెళ్లే చాన్స్ లేకపోవడంతో మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు షిఫ్ట్ చేశారు. ‘పంజాబ్, ముంబై మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ మమ్ముల్ని కోరింది. దీనికి మేం అంగీకరించాం. ముంబై జట్టు ఇక్కడికి చేరుకుంటుంది’ అని జీసీఏ సెక్రటరీ అనిల్ పటేల్ వెల్లడించారు.