హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలు పెరగడం, జీఎస్టీ 2.0 వల్ల ధరలు తగ్గడం, అమ్మకాలు పుంజుకోవడం, ఎగుమతులు పెరగడం వల్ల నిఫ్టీ వచ్చే ఏడాది నవంబరు నాటికి 29,094 స్థాయికి చేరుకోవచ్చని పీఎల్ క్యాపిటల్ రిపోర్ట్ అంచనా వేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ రాబడి అంచనాలను 2026, 2027, 2028 ఆర్థిక సంవత్సరాలకు వరుసగా 0.7శాతం, 0.9శాతం, 1.3శాతం వరకు పెంచింది.
‘‘2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కంపెనీల నికర లాభం వృద్ధి 16శాతంగా ఉంది. ఇది అంచనాలను మించింది. ఆటో సెక్టార్‌పై సానుకూలంగా ఉన్నాం. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు 5.49 లక్షల యూనిట్లు తాకాయి.
గత మూడు నెలల్లో నిఫ్టీ మూడు శాతం లాభపడింది. బ్యాంకులు, హెల్త్‌కేర్ , వినియోగదారుల వస్తువులు, ఆటోమొబైల్స్, రక్షణ రంగాల స్టాక్స్ఎక్కువ లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది.
