- వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేలా సన్నాహాలు
- సిలిండర్ల అవసరముండదు.. వంటింటిలోకి వచ్చేస్తుంది
- ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అమలు
- శామీర్‌పేట నుంచి సరఫరా
- 100 శాతం పీఎన్జీ సిటీ చేయాలన్నదే లక్ష్యం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఇరాన్ – అమెరికా యుద్ధం ఎఫెక్ట్‌తో జంటనగరాల్లో జనాలు గ్యాస్కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కావాల్సినంత గ్యాస్అందుబాటులో ఉందని, అవసరం లేకపోయినా బుక్చేస్తుండడంతో డెలివరీ చేయలేకపోతున్నామని డీలర్లు చెప్తున్నారు. డెలివరీ సందర్భంగా కొన్ని చోట్ల బాయ్స్‌ను కొట్టి గ్యాస్సిలిండర్లు లాక్కునే స్థాయికీ చేరుకుంది. భవిష్యత్‌లో ఇలాంటి కష్టాలు ఉండకుండా చేసేందుకు ఆయిల్‌కంపెనీలు ప్రత్యేక ప్లాన్లు రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలో వాడుతున్న పైప్లైన్నేచురల్గ్యాస్(పీఎన్జీ)ను విస్తరించడానికి కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే 300 చోట్లకు పైపులైన్
ప్రస్తుతం నగరంలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 300 నివాస సముదాయాలకు పీఎన్జీ సరఫరా అవుతోంది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, మణికొండ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, గేటెడ్‌కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ఇండ్ల ప్రాంగణాలకు శామీర్‌పేట్‌లో ఉన్న ప్లాంట్ నుంచి అండర్గ్రౌండ్పైపులైన్ద్వారా గ్యాస్సప్లై చేస్తున్నారు. ఈ గ్యాస్ నేరుగా కిచెన్లోకే వస్తుండడంతో జనాలు సౌకర్యవంతంగా ఫీలవుతున్నారు. స్విచ్ఆన్చేసి కావాల్సినంత వినియోగించుకునే అవకాశం ఉండడంతో అయిపోతుందనే చింత లేదు. సిలిండర్లను బుక్‌చేసుకుని రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితీ ఉండదు. వీరికి గ్యాస్సరఫరాను భాగ్యనగర్గ్యాస్ కంపెనీ...హెచ్‌పీసీఎల్, గ్యాస్అథారిటీ ఆఫ్ఇండియా (గెయిల్)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా పీఎన్జీ సరఫరా చేస్తున్నాయి.
డిమాండ్ పెరగడంతో విస్తరణ
వంటగ్యాస్ సంక్షోభంతో డిమాండ్పెరుగుతుండడంతో ముందుగా పీఎన్జీ లైన్లు ఉన్న ప్రాంతాల్లో మరింత మంది వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, వనస్థలిపురం, మేడ్చల్ కారిడార్‌లో పీఎన్జీ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని ప్రైవేట్కంపెనీలు కూడా కొత్తగా వెలుస్తున్న కాలనీలు, టౌన్‌షిప్‌లలో గ్యాస్ గ్రిడ్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. దశల వారీగా సిటీ అంతా విస్తరించి వంద శాతం పీఎన్జీ సిటీ చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే, ఇది చాలా ఖరీదుతో కూడుకున్నది కావడం, అండర్గ్రౌండ్నుంచి పైపులైన్వేయాల్సి రావడంతో చాలా సమయం తీసుకుంటుందని అంటున్నారు.
బిల్డర్ల ఆసక్తి...
భారీ సంఖ్యలో అపార్ట్మెంట్లు, గేటెడ్‌కమ్యూనిటీలు నిర్మించే బిల్డర్లు కూడా పీఎన్జీ వినియోగానికి అనుగుణంగా ప్రాజెక్టులు డిజైన్చేసుకుంటున్నారు. 80 శాతం కొత్త ప్రాజెక్టుల్లో పీఎన్జీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఆ స్థాయిలో గ్యాస్అందించేందుకు కంపెనీలు ప్లాన్చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేచురల్గ్యాస్అండ్ పెట్రోలియం ఆర్డర్-2026 ప్రకారం పీఎన్జీ పనులకు సులభంగానే అనుమతులు ఇస్తుండడంతో విస్తరణ పనులు స్పీడందుకునే అవకాశం ఉంది.
వెయిటింగ్లో 2 లక్షల దరఖాస్తులు!
జంటనగరాల్లో పీఎన్జీ కోసం ఇప్పటికే 2 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం పైప్ లైన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. భాగ్యనగర్గ్యాస్లిమిటెడ్పరిధిలో 2,15,698 కనెక్షన్లుండగా, ఇండియల్ఆయిల్పరిధిలో 42,354, ఇతర ప్రైవేట్కంపెనీల పరిధిలో 15,452 కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లతో పాటు సిలిండర్ల కొరతతో మరిన్ని దరఖాస్తులు వస్తున్నాయని ఆ దిశగా తాము విస్తరణ పనులకు ప్లాన్చేస్తున్నట్టు కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు.
