ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అజిత్ పవార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ చార్టర్డ్ ఫ్లైట్లో అజిత్ పవార్ తో పాటు ఆరు మంది ప్రయాణిస్తున్నారు.
#WATCH | A plane crash reported in Baramati, Maharashtra. More details awaited.
— ANI (@ANI) January 28, 2026
Visuals from the spot. pic.twitter.com/xkx0vtY5cp
బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. సాంకేతిక సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఈ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది.
