హైదరాబాద్​ సమీపంలో ప్లాస్టిక్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​ సమీపంలో ప్లాస్టిక్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ దక్షిణ భాగంలో రెండో ప్రత్యేక ప్లాస్టిక్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోందని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఎండీ విష్ణువర్ధన్ ​రెడ్డి వెల్లడించారు.  హైదరాబాద్​లో శుక్రవారం తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (తాప్మా) నిర్వహించిన పాలిమర్స్ కాన్ఫరెన్స్​లో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. 

ప్లాస్టిక్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దక్షిణ భారతదేశంలో తెలంగాణ అతిపెద్ద ప్లాస్టిక్​ హబ్​గా నిలిచిందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడానికే రెండో ప్లాస్టిక్ ​పార్క్​ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  ప్రతి జిల్లాలో 'మహిళాశక్తి ఇండస్ట్రియల్ హబ్స్' ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. తెలంగాణను సర్క్యులర్ ఎకానమీ (పునర్వినియోగ ఆర్థికవ్యవస్థ) కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లు రెడ్డి చెప్పారు.