వాట్సాప్‌ వాయిస్​ మెసేజ్ ఇకపై కొత్తగా!

వాట్సాప్‌ వాయిస్​ మెసేజ్ ఇకపై కొత్తగా!

వాట్సాప్​లో వాయిస్​ మెసేజ్​ ఫీచర్​ చాలా పాపులర్. చాటింగ్ బదులు వాయిస్​ మెసేజ్​ పంపిస్తే చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని చాలామంది ఈ ఫీచర్​ ఉపయోగిస్తుంటారు. యూజర్ల కంఫర్ట్  కోసం వాయిస్​ మెసేజ్​లో  కొత్త ఫీచర్లు తెచ్చింది వాట్సాప్. వాయిస్ మెసేజ్ రికార్డింగ్, షేరింగ్​ మరింత ఈజీ చేస్తాయి ఈ ఫీచర్లు. 

అవేంటంటే... చాట్ నుంచి బయటికి వచ్చాక కూడా వాయిస్  మెసేజ్​ని వినొచ్చు. అంతేకాదు  వాయిస్​ మెసేజ్​ని ఆపేసిన దగ్గరి నుంచి వినొచ్చు కూడా. వాయిస్​ మెసేజ్​ని రకరకాల స్పీడ్​లో ప్లే చేయొచ్చు. 

చాట్ ప్లే బ్యాక్:  ఇప్పటివరకు వాయిస్ మెసేజ్ వినాలంటే చాట్​లోకి వెళ్లాలి. అయితే, ఈ కొత్త ఫీచర్​ సాయంతో ఇకపై చాట్ నుంచి బయటికి వచ్చాక కూడా వాయిస్ మెసేజ్ వినొచ్చు. దాంతో, వాయిస్ మెసేజ్ వింటూనే మెసేజ్​లు చూస్తూ, రిప్లయ్​ ఇవ్వొచ్చు.  

పాజ్​​/ రెజ్యూమ్​: వాయిస్​ మెసేజ్ రికార్డ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్ని విషయాలు గుర్తుకు రావు. దాంతో, రెండు మూడు సార్లు వాయిస్​ మెసేజ్ పంపాల్సి వస్తుంది. అయితే  ఇకనుంచి ఆ సమస్య ఉండదు. వాయిస్​ మెసేజ్​ రికార్డింగ్​ని మధ్యలోనే ఆపేయొచ్చు. ఆలోచించుకున్న తర్వాత మళ్లీ మెసేజ్​ రికార్డింగ్​ని రెజ్యూమ్ చేయొచ్చు. 

డ్రాఫ్ట్ ప్రివ్యూ: ఈ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్​ని విన్న తర్వాత పంపించొచ్చు. దాంతో, ఏమైనా మిస్ అయితే, ఆ మెసేజ్​ డిలీట్ చేసి కొత్త మెసేజ్​ని రికార్డ్ చేయొచ్చు. 

ఫాస్ట్ ప్లే బ్యాక్:  వాయిస్​ మెసేజ్​ని మామూలు స్పీడ్​లో వింటాం. ఇప్పుడు 1.5 టైమ్స్​, 2 టైమ్స్ స్పీడ్​లో కూడా వినొచ్చు. ఫార్వర్డ్ వాయిస్ మెసేజ్​లని కూడా ఈ స్పీడ్​లో వినొచ్చు. 
రిమంబర్ ప్లే బ్యాక్: చాట్​ నుంచి బయటికి వస్తే,  మళ్లీ మొదటి నుంచి వాయిస్ మెసేజ్​  వినాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు వాయిస్​ మెసేజ్​ని 
పాజ్​ చేయొచ్చు. అంతేకాదు  పాజ్​ చేసిన 
వాయిస్​ మెసేజ్​ని ఆపేసిన దగ్గర నుంచి వినొచ్చు.