IND vs AUS : టెస్ట్ మ్యాచ్లా లేదు.. టీ 20 కంటే అధ్వాన్నం

IND vs AUS : టెస్ట్ మ్యాచ్లా లేదు.. టీ 20 కంటే అధ్వాన్నం

ఇండియా.. ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఆహో.. ఓవో అనుకున్నాం.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని ఆశించారు ఫ్యాన్స్.. కప్ నీదా నాదా అన్నట్లు ఊహించుకున్నారు.. ఇప్పుడు మ్యాచులు చూస్తుంటే.. చిరాకు వేస్తుంది. టీ 20 మ్యాచ్ లు ఆడుతున్నారా.. వన్డ్ మ్యాచులు ఆడుతున్నారు.. టెస్ట్ మ్యాచులు ఆడుతున్నారా అనేది కూడా తెలియటం లేదు ఫ్యాన్స్ కు.. 

బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేసే సమయానికి సగం వికెట్లు పడుతున్నాయి.. లంచ్ టైంకి ఆలౌట్ అవుతున్నారు.. ఈవినింగ్ సెషన్ లో మరో ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోతుంది.. చెత్త బ్యాంటింగ్ లో టీమిండియా.. ఆసీస్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ చూస్తే క్రికెట్ అభిమానులు ఇలాగే ఫీలవుతున్నారు. 

ఐదు రోజుల ఆటలో మొదటి రోజు 90 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ వెంటనే బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు తక్కువ కాదన్నట్లు టకటకా వికెట్లు కోల్పోయింది. రెండో రోజులు మ్యాచ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 88 పరుగుల లీడ్ లోకి వచ్చింది. 

ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచులు 3, 4 రోజుల్లోనే పూర్తవుతున్నాయి. ఇదివరకటిలా రోజుల తరబడి బ్యాటింగ్ చేయడం లేదు సరి కదా క్రిజులో పూర్తి సెషన్ నిలబడటానికి కూడా కష్టపడుతున్నారు. టీ20లు వచ్చాక ప్లేయర్లంతా టెస్టు ఆటపై పట్టు కోల్పోయారు.