నెగిటివ్ క్యారెక్టర్ చేయడం రిఫ్రెష్​గా ఉంది : వెంకటేష్

నెగిటివ్ క్యారెక్టర్ చేయడం రిఫ్రెష్​గా ఉంది : వెంకటేష్

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ముందుగా వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు వెంకటేష్. కెరీర్‌‌‌‌లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన  ఆయన.. ‘రానా నాయుడు’  సిరీస్‌‌లో సరికొత్త గెటప్‌‌లో కనిపించనున్నారు. వెంకటేష్, రానా ఇందులో తండ్రీకొడుకులుగా పోటాపోటీగా నటించారు.  కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్  పాపులర్ అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్‌‌’కు ఇండియన్ అడాప్టేషన్​. మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్‌‌లో  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,  హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కోసం వర్క్ చేసిన ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు వెంకటేష్.

‘ఇది నాకు ఎక్సయిటింగ్ జర్నీ. సినిమాలకు, సిరీస్‌‌లకు చాలా తేడా ఉంటుంది. నెగిటివ్ క్యారెక్టర్ చేయడం రిఫ్రెష్​గా ఉంది. పూర్తిగా  భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ చాలా తృప్తిని ఇచ్చింది. రానాతో ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్‌‌గా అనిపించింది. ఆఫ్‌‌ స్ర్కీన్‌‌లో మా ఇద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. బాబాయ్ అబ్బాయి కంటే మేము స్నేహితులుగా ఉంటాం. అలాంటిది ఈ సిరీస్‌‌లో  ఒకరంటే ఒకరికి పడని తండ్రి-కొడుకులుగా చేశాం. ఇప్పటివరకు ఫేస్ చేయని సిట్యువేషన్స్, ఎమోషన్స్‌‌తో మేం చేసిన కొత్త ప్రయత్నంతో  ప్రేక్షకులు కచ్చితంగా కనెన్ట్ అవుతారు’ అన్నారు.