సీఈసీపై వేటు వేయండి...! సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం

సీఈసీపై వేటు వేయండి...! సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం

న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, చైర్మన్ హోదాలో ఉన్న సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేరన్న విషయాన్ని స్పష్టం చేయాలని పిటిషనర్ కోరారు. 

ఎన్నికల కమిషనర్లు సుఖ్‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నమోదు చేసిన లిఖితపూర్వక అభ్యంతరాలను పట్టించుకోకుండా, దాదాపు 14 కీలక నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా అమలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ సుదీప్ చంద్ర రూపొందించిన ఈ పిటిషన్‌‌ను అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్‌‌‌‌) ముదిత్ గుప్తా ద్వారా రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేశారు.