చాయ్ తాగుడు కొంచెం తగ్గించండి

చాయ్ తాగుడు కొంచెం తగ్గించండి

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ఎక్కువైతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. నిత్యావసరాల ధరలు కూడా మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాయ్ తాగుడు తగ్గించాలని అక్కడి ప్రణాళిక, అభివృద్ధి మంత్రి అహ్సన్ ఇక్బాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశ అప్పులు పెరిగాయని, చాయ్​పత్తీ కూడా దిగుమతి చేసుకుంటుంన్నందున.. చాయ్ తాగుడు ఒకట్రెండు కప్పులు తగ్గించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయింది. ఆయన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు సక్కగ ఆర్థిక సంస్కరణలు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ రిప్లై ఇస్తున్నారు. లీడర్ల ఫారిన్ టూర్ల ఖర్చులు తగ్గిస్తే తాము కూడా చాయ్ తాగుడు తగ్గిస్తమని మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కౌంటర్ ఇచ్చారు.