సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ లేఖ

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్మికులకు కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని, వాటిలో కమర్షియల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, ఇండ్లను నిర్మించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ) సెక్రటరీ పద్మానాభరెడ్డి ఆరోపించారు. 1984లో అప్పటి ప్రభుత్వం 45 ఎకరాలను వారికి కేటాయించిందని, అందులో 5 ఎకరాలు స్కూళ్లు, పార్కులు, ప్లే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ కోసం ఇచ్చారన్నారు. ఈ ఐదెకరాల్లో 100 ప్లాట్లను రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులతో స్థానిక రాజకీయ నాయకులు కుమ్మక్కై కబ్జా చేసి అమ్ముకున్నారన్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు కొంత మందికి నోటీసులిచ్చి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారని ఆయన చెప్పారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు విజిలెన్స్ ద్వారా దర్యాప్తు జరిపించాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయన లేఖ రాశారు.