ఈ కేవైసీ అప్​డేట్​ కాక రైతుల పరేషాన్

ఈ కేవైసీ అప్​డేట్​ కాక  రైతుల పరేషాన్

హబూబ్​నగర్​/మిడ్జిల్​, వెలుగు: కేంద్రం నుంచి రైతులను నేరుగా పెట్టుబడి సాయం అందించే ‘పీఎం కిసాన్‌‌‌‌ సమ్మాన్ నిధి’ పోర్టల్ సతాయిస్తోంది.  ఈకేవైసీ చేసుకుంటేనే ఈ స్కీం వర్తిస్తుందని సెంట్రల్​గవర్నమెంట్​షరతు పెట్టిన విషయం తెలిసిందే.  ఈ నెల 31 వరకే గుడువు విధించడంతో మీసేవ, ఇతర ఆన్‌‌‌‌లైన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే  దేశంలోని రైతులందరూ ఇదే సర్వర్‌‌‌‌‌‌‌‌ను వినిగియోగిస్తుండడంతో సైట్​ఓపెన్​ కావడం లేదు. ఓపెన్‌‌‌‌ అయినా ఆధార్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ లింక్ ఉంటేనే ఈకేవైసీకి ఆప్షన్‌‌‌‌ వస్తుండడంతో ప్రాసెస్ లేట్ అవుతోంది.  

11 విడత డబ్బుల కోసం..

2018లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్​ సమ్మాన్​ స్కీంను  తీసుకొచ్చింది.  10 ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాలో ఏడాదికి రూ.6 వేలు జమ చేస్తోంది.  ఈ ఏడాది 11వ విడతకు  ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం..  ఆన్​లైన్​లో ఈ-కేవైసీని అప్​డేట్​ చేసుకుంటేనే డబ్బులు అకౌంట్లలో వేస్తామని స్పష్టం చేసింది.  మార్చి చివరి వారం నుంచి htpp//pmkisan.gov.in/  పోర్టల్​​ద్వారా  ఈ-కేవైసీని అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది.  రైతు ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్​లింక్ ఉంటేనే ఈ-కేవైసీ చేయడానికి వీలవుతుంది.  లింక్ లేని వారికి కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసే ఆప్షన్ కల్పించారు.  కానీ, బయోమెట్రిక్ సర్వర్ కూడా పని చేయడం లేదు. దీంతో ఆధార్, మీ-సేవా సెంటర్ల వద్ద రైతులు క్యూ కడుతున్నారు. 

అందరూ ఒకేసారి చేయడం వల్లే..

మార్చి, ఏప్రిల్, ఈ నెల మూడో వారం వరకు తెలంగాణ జిల్లాల్లో రైతులు వడ్ల సెంటర్ల వద్దే బిజీగా ఉండిపోయారు. ప్రస్తుతం  కాంటాలు పూర్తవడంతో పీఎం సమ్మాన్ నిధి కోసం ఈ-కేవైసీని అప్​డేట్​ చేసుకుంటున్నారు. కానీ,  దేశంలోని రైతులు మొత్తం ఇదే సైట్​ద్వారా ఈ-కేవైసీని అప్​డేట్​చేసుకుంటుండటంతో ఫుల్​బిజీగా ఉంది.  ఓపెన్ అయినా ఎక్కువ సేపు ఉండటం లేదు.  ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇలాగే సతాయిస్తోంది. రాత్రి తొమ్మిది గంటల  సైట్​ పనిచేస్తున్నా.. అప్పటికే  మీ-సేవ, ఆధార్​ సెంటర్లు మూసి వేస్తున్నారు. 

60 శాతం రైతులు అప్‌‌‌‌డేట్ చేసుకోలే..

ఈ-కేవైసీ అప్​డేట్​ చేసుకోవడానికి ఇంకా ఆరు రోజుల టైమ్‌‌‌‌ మాత్రమే ఉంది. అంతలోపు ఈ-కేవైసీని అప్​డేట్​​చేయకుంటే, రైతుల ఖాతాలో ఈ స్కీం డబ్బులు పడవు. పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 40 శాతం మంది రైతులే ఈ-కేవైసీని అప్​డేట్​ చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.  జిల్లాలో మొత్తం 1.05 లక్షల మంది ఈ స్కీంకు అర్హులుగా ఉన్నారు. వీరిలో మంగళవారం నాటికి 45,758 మంది ఈ-కేవైసీ చేసుకున్నారు. అందులో 3,630 మంది ఇన్​ ఎలిజబుల్​గా ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

సైట్ వస్తలేదంటున్నరు..

ఈ సారి మోడీ పైసలు పడాలంటే ఏదో ఈ-కేవైసీ చేయించాలంటున్నరు. నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకు లేదు. ఈ-కేవైసీ చేయనీకే మీ-సేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న. సైట్ వస్తలేదని చెబుతున్నరు. ఆధార్​ సెంటర్​కు పోయి ఫోన్​ నంబర్​ లింక్​ చేయించుకొని రమ్మని చెబుతున్నరు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. -నర్సయ్య, వల్లభురావుపల్లి, మిడ్జిల్​ మండలం

లోడ్​ ఎక్కువ అవుతోంది..

దేశం మొత్తంగా ఒకటే సైట్​ ఉంది. అందరూ ఒకే సారి ఓపెన్​ చేయడం వల్ల లోడ్​ పడుతోంది. దీంతో ఓపెన్​ కావడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత మాత్రం నార్మల్​గా ఓపెన్​ అవుతోంది. డెడ్​లైన్​ ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఎక్స్​టెంట్​ చేసే విషయంపై మాకు ఎలాంటి సమాచారం రాలేదు.  – బి.వెంకటేశ్​, అగ్రికల్చర్​ ఆఫీసర్​, పాలమూరు

 

ఇవి కూడా చదవండి

ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు