జమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి: మోడీ

జమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి: మోడీ

జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కశ్మీర్ యువత ముందుకు రావడం సంతోషిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎప్పుడు పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఉద్యోగాల్లో చేరుతున్న యుువకులు కూడా అదే విధంగా ఇవ్వాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ జమ్మూ కాశ్మీర్ రోజ్ గార్ మేళా నిర్వహించారు.

గత 8 సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని మోడీ వెల్లడించారు. కొద్ది నెలల్లో 10 లక్షలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను కేంద్ర ప్రభుత్వం అందజేయనుందని ప్రకటించారు. 2019 నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ లోలో దాదాపు 30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయబడ్డాయన్నారు. 1-1.5 సంవత్సరాల్లో దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పర్యాటక రంగం బలోపేతమవుతోందని.. జమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని సూచించారు.