
మలయాళ సూపర్ స్టార్ హీరో సురేష్ గోపి కుమార్తె పెళ్లి.. జనవరి 17వ తేదీ బుధవారం కేరళలో జరిగింది. గురువాయూర్ ఆలయంలో తన కుమార్తె భాగ్యను.. శ్రేయాస్ మోహన్ కు ఇచ్చి పెళ్లి చేశారు సురేష్ గోపి. ఈ పెళ్లికి పెద్దగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించారు. పెళ్లికి హాజరైన మోదీ.. కొత్త జంటకు పూల దండలు అందించారు. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన అతిధులకు స్వయంగా అక్షింతలు పంచారు. పెళ్లి వేడుకలో మోదీ అంతా తానై.. పెళ్లి పెద్దగా వ్యవహరించటం ఆసక్తి రేపుతోంది.
PM Modi met superstars Mohanlal and Mammootty while attending Suresh Gopi's daughter's wedding in Guruvayur.
— Political Views (@PoliticalViewsO) January 17, 2024
Apart from Suresh Gopi's daughter, PM Modi also blessed other couples in the temple.#Guruvayur #SureshGopi #Kerala #NarendraModi pic.twitter.com/B7KgqAge6S
సురేష్ గోపి కుమార్తె పెళ్లికి మలయాళంలోని ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. వీరిలో మమ్ముట్టీ, మోహన్ లాల్ వంటి వారు ఉన్నారు. వాళ్లందరినీ పరిచయం చేయసుకున్న మోదీ.. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రధానమంత్రి అంటే ఎంత హోదా.. ఎంత దర్పం ఉండాలండీ.. అలాంటివి ఏమీ లేకుండా గురువాయూర్ ఆలయంలో.. ఎంతో సాదాసీదాగా దేవుడిని దర్శించుకుని మన ప్రధానమంత్రి మోదీ.. ఆ తర్వాత సురేష్ గోపి కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. చాలా సింపుల్ గా పంచకట్టులో హాజరయ్యారు. కుమార్తె మెడలో తాళి కట్టే సమయంలో దండం పెడుతూ ఆశీర్వదించారు. ఇద్దరికి దండలు అందించారు.. ఒకరి చేతిలో మరొకరి చేతిని ఉంచి.. ఆశీర్వదించారు. ప్రధానమంత్రి మోదీ.. ఇంత సింపుల్ గా.. ఓ హీరో కుమార్తె పెళ్లికి హాజరయ్యి.. పెళ్లి పెద్దగా వ్యవహరించటమే కాకుండా.. ఆ ఆలయంలో జరుగుతున్న మరికొంత మంది పెళ్లిళ్లకు వెళ్లి.. కొత్త జంటలకు శుభాకాంక్షలు చెప్పటం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు.. మీరు మహానుభావులు సారూ అంటూ.. మోదీని శెభాష్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్లు.