పోలీసులపై నెగెటివ్​ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ మార్చేలా  పని చేయండి

V6 Velugu Posted on Aug 01, 2021


న్యూఢిల్లీ:పోలీసు అధికారుల ప్రతి చర్యలోనూ ‘నేషనల్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ స్ఫూర్తి ప్రతిబింబించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పోలీసులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావనను మార్చేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్​లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్​ తీసుకుంటున్న ప్రొబేషనరీ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆయన మాట్లాడారు. జాతీయ ప్రయోజనాల కోసమే పని చేయాలని సూచించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ జెండాను మోసేది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేనన్నారు. ‘‘పోలీసులపై ప్రజలకు ఉన్న ప్రతికూల భావన ఓ పెద్ద సవాలు. కరోనా మొదలైన కొత్తలో పోలీసులు చేసిన సాయంతో అది కాస్త మారింది” అని చెప్పారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. మరి పోలీసుల విషయంలో ఇలాంటి భావమే ఉందా? దీనికి సమాధానమేంటో మీకు కూడా తెలుసు. దేశ రక్షణ కోసం.. శాంతి భద్రతలు కాపాడటం కోసం.. టెర్రరిజంపై పోరులో మన పోలీసు సిబ్బంది ప్రాణాలను త్యాగం చేస్తారు. కొన్ని రోజులపాటు ఇండ్లకు వెళ్లకుండా ఉంటారు. పండుగల సమయంలో ఇంట్లో ఉండరు. ఇంత చేస్తున్నా పోలీసులకు ఉన్న ఇమేజ్.. వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వేరు’’ అని చెప్పారు. పోలీసు ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి కొత్త జనరేషన్ వస్తోందని, నెగెటివ్ పర్సెప్షన్ ఇకపై ఉండదని ఆశాభావం వ్యక్తంచేశారు. 

అప్పుడు స్వరాజ్యం, ఇప్పుడు సురాజ్యం కోసం..

‘‘గత 75 ఏళ్లలో మెరుగైన పోలీస్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు దేశం ప్రయత్నించింది. పోలీస్ ట్రైనింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రూవ్ అయింది. 1930 నుంచి 1947 మధ్య స్వాతంత్ర్యం కోసం యువత ముందుకు వచ్చింది. ఇప్పుడు మీ (ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు) నుంచి ఇలాంటి సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశిస్తున్నాం. అప్పుడు స్వరాజ్యం కోసం పోరాడాం.. ఇప్పుడు సురాజ్యం (గుడ్ గవర్నెన్స్) కోసం ప్రయత్నిద్దాం” అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్ల ఇండియా డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చాలా ముఖ్యమని అన్నారు. కొత్త కొత్త నేరాలను అడ్డుకోవడమే ఇప్పుడున్న సవాలని, ఇందుకు పోలీసులు టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సిద్ధంగా ఉండాలన్నారు. 10 లక్షల జనాభాకు పైన ఉన్న సిటీల్లో కమిషనర్  సిస్టమ్ తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. 

అవసరమైనప్పుడు అండగా..

కొన్ని పొరుగు దేశాలకు చెందిన పోలీసు అధికారులు కూడా శిక్షణలో భాగం కావడంపై మోడీ స్పందిస్తూ.. ఆయా దేశాలతో క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోతైన సంబంధాన్ని ఇది నొక్కి చెబుతోందని అన్నారు.

Tagged pm modi, POLICE, IPS., negative perception

Latest Videos

Subscribe Now

More News