చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన మోడీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్లు  మోడీ ప్రకటించారు. 

చిత్తూరు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రస్తుతం తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాదంపై స్పందించిన ఏపీ సీఎం జగన్.. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.