ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఉమెన్ చాందీ : నరేంద్ర మోదీ

 ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి  ఉమెన్  చాందీ  : నరేంద్ర మోదీ

కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం ఉమెన్  చాందీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశం నిబద్ధత కలిగిన నేతను కోల్పోంయిదన్నారు. తానూ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, ,చాందీ కేరళ సీఎంగా ఉన్నప్పుడు పలు సందర్భాలలో కలిసిన రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు.  చాందీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  ఆయన అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. చాందీ మృతి  తనను ఎంతో బాధించిందన్నారు రాహుల్ గాంధీ. చాందీ జీవితం ఆదర్శమన్న రాహుల్.. కేరళ ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయనను చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. 

ALSO READ :బీసీనే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి: గాలి వినోద్ కుమార్

 గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో  బాధపడుతున్న ఉమెన్  చాందీ బెంగళూరులోని  చిన్మయ మిషన్ హాస్పిటల్  చికిత్స పొందుతూ 2023 జులై 18 ఉదయం కన్నుమూశారు.  ఈ విషయాన్ని తన కుమారుడు చాందీ ఉమెన్ తన ఫేస్ బుక్ లో తెలిపారు. అప్పా చనిపోయాడని పోస్ట్ చేశారు. ఉమెన్ చాందీ 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నియోజకవర్గం నుంచి  1970లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఉమెన్ చాందీ వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977 లో కె. కరుణాకరన్  కేబినెట్ లో తొలిసారి మంత్రిగా పనిచేశారు. ఉమెన్ చాందీ  రెండు సార్లు(2004-2006, 2011-2016) సీఎంగా పనిచేశారు. ఆయనకు  ముగ్గురు పిల్లు అచు ఊమెన్, మరియా ఊమెన్, చాందీ ఊమెన్