ఫిజీ కొత్త ప్రధానికి మోడీ శుభాకాంక్షలు

  ఫిజీ కొత్త ప్రధానికి మోడీ శుభాకాంక్షలు

ఫిజీ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన  సితివేణి రబుకాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్,ఫిజీ మధ్య సన్నిహిత, దీర్ఘకాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాను ఎదురుచూస్తున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు. సితివేని రబుకా ఫిజీ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ఆ దేశ పార్లమెంట్ ప్రకటించింది. 

పార్లమెంటులో రబుకా 28 ఓట్లతో ఎన్నికయ్యారు. అయితే ఫిజీ మాజీ ప్రధాని వోరెక్ బైనిమరామకు 27 ​ఓట్లు వచ్చాయి.   ఫిజీకి సితివేని రబుకా 12వ ప్రధానమంత్రి కావడం విశేషం.  2021లో ఫిజీలో ఏర్పడిన రాజకీయ పార్టీ పీపుల్స్ అలయన్స్ నాయకుడే రబుకా. 2006 సైనిక తిరుగుబాటులో ప్రభుత్వాన్ని పడగొట్టి, ఒక సంవత్సరం తర్వాత దేశ ప్రధానమంత్రి అయిన ఫ్రాంక్ బైనిమరామ స్థానంలో రబుకా నియమితులయ్యారు.