సీఎం రేవంత్ రెడ్డికి.. ప్రధాని మోదీ అభినందలు

సీఎం రేవంత్ రెడ్డికి.. ప్రధాని మోదీ అభినందలు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి.. అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి మోదీ. ఈ మేరకు డిసెంబర్ 7వ తేదీన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విషస్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అంటూ కామెంట్ చేశారు.

ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నరేంద్ర మోదీ ఎక్స్ నుంచి ఈ పోస్టులు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీ ఓడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఈ విధంగా అభినందనలు తెలియజేశారు ప్రధాని మోదీ..