
తమ ప్రమేయం లేకుండానే మోడీ, ట్రంప్, పుతిన్ లాంటి ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచారంలో దర్శనమిస్తున్నరు. సెప్టెంబర్ 17న జరగనున్న ఎన్నికల కోసం అక్కడి పార్టీలు రకరకాలుగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని, ‘లికుడ్ పార్టీ’ చీఫ్ బెంజిమెన్ నెతన్యాహు కాస్త వెరైటీగా వరల్డ్ లీడర్లను వాడేసుకుంటున్నారు. మోడీ, ట్రంప్, పుతిన్ తదితరులతో దిగిన ఫొటోల్ని దేశమంతటా ఫ్లెక్సీలుగా వేయించారు. తద్వారా నెతన్యాహును ప్రపంచం మెచ్చిన నేతగా ఫోకస్ చేయడంతోపాటు ఇతరదేశాల మూలాలున్న ఓటర్లనూ ఆకట్టుకోవడం లికుడ్ పార్టీ ఎత్తుగడ అని ఇజ్రాయెలీ జర్నలిస్టులు అంటున్నారు. టెల్అవీవ్ సిటీలో లికుడ్ పార్టీ హెడ్‌క్వార్టర్ వద్ద ఏర్పాటుచేసిన ప్రచారచిత్రమిది.