కాల్చి చంపుతాం అంటే చూస్తూ ఊరుకోను: ఇరాన్ దేశానికి ట్రంప్ వార్నింగ్

కాల్చి చంపుతాం అంటే చూస్తూ ఊరుకోను: ఇరాన్ దేశానికి ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: ఇరాన్‎లో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనలను అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. శాంతియుత నిరసనకారులను కాల్చి చంపితే చూస్తూ ఊరుకోమని.. వాళ్లకు అమెరికా అండగా నిలుస్తోందని చెప్పారు. నిరసనకారులను చంపితే యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని సంచలన వార్నింగ్ ఇచ్చారు. 

ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తిప్పికొట్టింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు అలీ లారిజాని మాట్లాడుతూ.. ఇరాన్ నిరసనల్లో అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతటా గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ తలదూర్చకపోవడమే మంచిదని హితవు పలికారు. అమెరికా దాడులకు ఇరాన్ బలంగా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు.  

Also Read : వాళ్లు ఇచ్చింది మంచి నీళ్లు కాదు విషం

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఇటీవల ఇరానీ రియాల్ విలువ డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోల్చితే భారీగా పతనమైంది. ఓపెన్ మార్కెట్‎లో ఒక అమెరికన్ డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోల్చితే ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయి 2025లో కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. దాంతో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఇప్పటికే అణు ఆంక్షల ఎఫెక్ట్ ఆ దేశంపై తీవ్రంగా పడగా.. ఇప్పుడు ఇంధన సంక్షోభం, నీటి కొరత, గాలి కాలుష్యం, ఇంటర్నెట్ నియంత్రణతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అంతర్జాతీయ ఆంక్షలు, నూక్లియర్ ఒత్తిళ్లు, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జూన్‎లో జరిగిన ఘర్షణ పరిణామాలు ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది.

వెల్లువెత్తుతున్న నిరసనలు

ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదాఆహారర్థాల ధరలు 72%, ఆరోగ్య సంబంధిత వస్తువుల రేట్లు 50% పెరిగాయి. ఇంధన ధరల పెంపు, పన్నుల పెంపు ప్రతిపాదనలు ప్రజలపై మరింత భారాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో టెహ్రాన్, హమదాన్, ఇస్ఫహాన్, షిరాజ్ వంటి నగరాల్లో వ్యాపారులు, దుకాణదారులు తమ షాపులను మూసివేసి నిరసనలకు దిగారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ర్యాలీలు చేశారు. వీరికి తోడుగా కార్మికులు, నర్సులు, గని కార్మికులు కూడా సమ్మెలు, ధర్నాలు చేపట్టారు. ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.