నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే మొదటి సెమీ హైస్సీడ్ సర్వీస్

నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ..  దేశంలోనే మొదటి సెమీ హైస్సీడ్ సర్వీస్

దేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు  నమో భారత్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఘజియా బాద్, మీరట్  మీదుగా RRTS  కారిడార్ లో ఈ రైలు పరుగులు పెట్టింది.  అక్టోబర్ 20 న సాహబాబాద్ దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల RRTS  కారిడార్ ను ప్రధాని మోదీ జెండా ప్రారంభించారు.  మొత్తం 82.15 కిలోమీటర్ల RRTS  కారిడార్2025 నాటికి పూర్తి కానుంది. 

 RRTS  కారిడార్ లో మొత్తం 24 స్టేషన్లు ఉండగా.. మొదటి ప్రాధాన్యతగా సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దర్, దుహై, డిపోల మధ్య రైళ్లను ప్రారంభించారు. నవభారత్ రైళ్లు ప్రత్యేకంగా  RRTS  కారిడార్ కోసం ప్రవేశపెట్టారు. దేశంలో మొట్ట మొదటి సెమీ హైస్పీ్ రీజినల్ రైల్ సర్వీస్ ప్రాజెక్టులో  RRTS  రైళ్లకు RAPIDXఅని పేరు పెట్టారు. నమోభారత్ రైళ్లలో సాహిబాబాద్ నుంచి దుహై స్టేషన్ల మధ్య ప్రయాణించేందుకు టిక్కెట్ ధర రూ. 50 .. అయితే ప్రీమీయిం క్లాస్ టిక్కెట్ ధర రూ. 100 అని NCRTC తెలిపింది.