
- జీ-7 సమిట్ పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లనున్న ప్రధాని
న్యూడిల్లీ: ఇటలీలో జరగనున్న జీ-7 సమిట్ లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. జీ-7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వల్ల గతేడాది భారత్ నేతృత్వం వహించిన జీ-20 సమిట్ లో తీసుకున్న నిర్ణయాల ఫలితాలను సమీక్షించుకునేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు.
సమిట్ లో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయాన్ని మాత్రం క్వాత్రా పేర్కొనలేదు. జూన్ 13 నుంచి జూన్ 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా లగ్జరీ రిసార్ట్‌లో జీ-–7 సమిట్ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ తో సహా పలువురు దేశాధినేతలు పాల్గొననున్నారు.