ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మోదీ ఆదర్శం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మోదీ ఆదర్శం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

నాటి తరం.. నేటి తరమే కాదు.. ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ప్రధాని మోదీ ఆదర్శంగా అభివర్ణించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సూపర్ GST.. సూపర్ సేవింగ్స్ అంటూ ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా నన్నూరు గ్రామంలోని బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

ప్రధాని మోదీ నాయకత్వం దేశానికే కాదని.. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉందని.. మన దేశం ప్రపంచంలో గర్వంగా తల ఎత్తుకుని నిలబడే విధంగా చేశారన్నారు పవన్ కల్యాణ్. జీఎస్టీ తగ్గింపుతో.. ప్రతి కుటుంబానికి 20 వేల రూపాయలు ఆదా అవుతుందన్నారాయన. ఇది విద్య, వైద్యం ఖర్చుల భారం నుంచి సామాన్యులకు ఉపసమనం కలుగుతుందన్నారు. ఇన్సూరెన్స్ లపై జీఎస్టీ భారం తగ్గించి.. ప్రజలకు లాభం చేకూర్చిన ఘనత మోదీదే అన్నారాయన. ఊర్వకల్లులో 4 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టటం అనేది ఆనందంగా ఉందన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు ఉండాలని.. మోదీ నాయకత్వంలో.. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. మరో 15 ఏళ్లు కూటమి కొనసాగుతుందని.. అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని బహిరంగ వేదికగా స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.