అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. దేశ ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు

అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. దేశ ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు

అత్యంత పవిత్రంగా భావించే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ఉండాలని ఆకాంక్షించారు. దాంతో పాటు తాను రాసిన గర్బా పాటను కూడా ఆయన షేర్ చేశాడు. ప్రజలను ఆకాంక్షిస్తూ, "బలాన్ని ఇచ్చే మాత దుర్గా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం. మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని ఆయన Xలో రాసుకువచ్చారు

Also Read : ఇగోలు పక్కన పెట్టండి..బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్

"నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న వేళ, వారం కింద నేను రాసిన గర్బా పాటను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గర్బాకు గాత్రం మరియు సంగీతం అందించినందు దివ్య కుమార్‌కి ధన్యవాదాలు" అని, గర్భా సాంగ్ కు చెందిన యూట్యూబ్ లింక్ ను కూడా మోదీ ఈ ట్వీట్ కు జత చేశారు.

హోం మంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. "శక్తిని ఆరాధించే పవిత్ర పండుగైన నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మాతా రాణి ప్రతి ఒక్కరిపై తన ఆశీర్వాదాలను కురిపిస్తుంది. మాత దేవతకి వందనం" అని ఆయన X లో తెలిపారు.