
ప్రధాని మోదీపై కాంగ్రెస్ఎంపీ రాహుల్మరోసారి మండిపడ్డారు. భారత్,రష్యా ఆయిల్ డీల్‌పై అమెరికా అధ్యక్షుడి ట్రంప్మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ట్రంప్‌ను చూసి భయపడుతున్నారు..భారత్, రష్యా చమురును కొనుగోలు వ్యవహారంపై ట్రంప్ నిర్ణయించడం, ప్రకటించేంతగా లీనియన్స్ఇస్తున్నాకగ.. అమెరికా పదే పదే తిడుతుంటే కూడా వారిని అభినందిస్తూ , పొగడ్తూ మేసేజ్‌లు పంపుతున్నారు.. ట్రంప్ బెదిరింపులకు మోదీ భయపడ్డారని రాహుల్ విమర్శించారు.
భారత్,రష్యా ఆయిల్ డీల్‌పై ట్రంప్ ఏమన్నారంటే..
భారత్, రష్యా ఆయిల్ డీల్‌పై బుధవారం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యానుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదు.. ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు.. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌజ్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పారు. మోదీ నాకు మంచి ఫ్రెండ్.. నేను ఏది చెప్పినా చేస్తాడు అనే ధోరణిలో ట్రంప్వ్యాఖ్యలు చేశారు. మోదీ భయపడుతున్నాడు కాబట్టే..ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేలా ఛాన్స్ ఇస్తున్నారని విమర్శించారు రాహుల్.