సికింద్రాబాద్-విశాఖపట్టణం .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

సికింద్రాబాద్-విశాఖపట్టణం  .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 వ తేదీ మంగళవారం రోజున  వర్చువల్ గా ప్రారంభించారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నంబర్ 10 పైన వందేభారత్ రైలుకు  పచ్చ జండా ఊపి కిషన్ రెడ్డి, రైల్వే అధికారులు ప్రారంభించారు.  

ఈ నెల13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది.  ఈ వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ రెండు తెలుగు​ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది.  కేవలం గురువారం మాత్రమే ఈ వందేభారత్​ రైలు నడవదు.  వరంగల్​, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది.  మొత్తం 530 మంది ఇందులో ప్రయాణించవచ్చు.  

ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడో వందే భారత్ రైలు కాగా.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండోది కావడం విశేషం.  రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.